ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ ఫిబ్రవరి 5వ తేదీ నాడు హైదరాబాద్ ను సందర్శించనున్నారు. ఆ రోజు న మధ్యాహ్నం పూట సుమారు 2 గంటల 45 నిమిషాల వేళ కు, ప్రధాన మంత్రి హైదరాబాద్ లోని పటాన్ చెరు లో మెట్ట ప్రాంత పంట ల సంబంధి అంతర్జాతీయ పరిశోధన సంస్థ (ఇంటర్ నేశనల్ క్రాప్స్ రిసర్చ్ ఇన్స్ టిట్యూట్ ఫార్ ది సెమీ- ఎరిడ్ ట్రాపిక్స్.. ఐసిఆర్ఐఎస్ఎటి- ‘ఇక్రిశాట్’) ఆవరణ ను సందర్శించి, ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవాల ను ప్రారంభిస్తారు. అదే రోజు న సాయంత్రం పూట ఇంచుమించు 5 గంటల వేళ కు, ప్రధాన మంత్రి హైదరాబాద్ లోని ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ని దేశ ప్రజల కు అంకితం చేస్తారు.
11వ శతాబ్ది కి చెందినటువంటి భక్తి ప్రబోధక ముని శ్రీ రామానుజాచార్య ను స్మరించుకొనేందుకు 216 అడుగుల ఎత్తయినటువంటి ‘సమతా విగ్రహం’ ని (‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’) ఏర్పాటు చేయడమైంది. శ్రీ రామానుజుల వారు ధర్మం, కులం, వర్గం లు సహా జీవనం లోని అన్ని అంశాల లోనూ సమానత్వం అనే ఉద్దేశ్యాన్ని ప్రోత్సహించారు. సమతా విగ్రహాన్ని బంగారం, వెండి, రాగి, ఇత్తడి, ఇంకా జింకు అనే అయిదు లోహాల కలయిక.. అదే.. ‘పంచలోహం’ తో రూపొందించడం జరిగింది. ఈ విగ్రహాన్ని కూర్చొన్న భంగిమ లో ప్రపంచం లో ఏర్పాటైన అతి ఎత్తయిన లోహ విగ్రహాలన్నిటిలోకీ ఒక విగ్రహం గా పేర్కొనవలసివుంది. ‘భద్ర వేది’ పేరు తో గల 54 అడుగుల ఎత్తయిన ఆధార భవనం మీద శ్రీ రామానుజాచార్య విగ్రహాన్ని అమర్చారు. దీని లో ఒక వైదిక డిజిటల్ గ్రంథాలయం మరియు పరిశోధన కేంద్రం, భారతీయ పురాతన మూలగ్రంథాలు, ఒక రంగస్థలం, వీటికి తోడు గా శ్రీ రామానుజాచార్య లిఖించిన అనేక రచనల ను కళ్ల కు కట్టే ఒక విద్యా ప్రదర్శన శాల.. వీటన్నిటికై ప్రత్యేకించిన అంతస్తు లు కూడాను ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ రామానుజాచార్య ఆశ్రమానికి చెందిన శ్రీ చిన్న జీయర్ స్వామి ఆలోచన ల ప్రకారం సమతా విగ్రహాన్ని రూపుదిద్దడమైంది.
శ్రీ ఈ కార్యక్రమం లో భాగం గా, రామానుజాచార్య జీవన యానానికి మరియు ఆయన బోధనల కు సంబంధించిన 3డి ప్రజెంటేశన్ మేపింగ్ ను కూడా ప్రదర్శించడం జరుగుతుంది. 108 దివ్య దేశాల (అందంగా చెక్కిన ఆలయాల) ను పోలివుండే పునర్ నిర్మిత ఆకృతుల ను సమతా విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) చుట్టూరా ఏర్పాటు చేశారు. ప్రధాన మంత్రి ఆ నిర్మాణాల ను సైతం సందర్శించనున్నారు.
ప్రతి మనిషి ని ఆ వ్యక్తి ది ఏ దేశం ?, ఏ లింగం?, ఏ జాతి?, ఏ కులం?, ఏ వర్గం? అనేవి ఏవీ చూడకుండా మనుషులంతా సమానులే అనే భావన తో ఎంచుతూ, ప్రజల అభ్యున్నతి కోసం శ్రీ రామానుజాచార్య అవిశ్రాంతం గా పాటుపడ్డారు. ఈ సమతా విగ్రహ ఆవిష్కరణ అనేది ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి శ్రీ రామానుజాచార్య యొక్క 1000వ జయంతి ఉత్సవాల లో ఒక భాగం గా ‘శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం’ పేరు తో ఏర్పాటు చేసిన కార్యక్రమమే.
ప్రధాన మంత్రి తన పర్యటన లో భాగం గా, ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవాల ను అంత క్రితం ప్రారంభించనున్నారు. ఇక్రిశాట్ కు చెందిన సస్య రక్షణ సంబంధి జలవాయు పరివర్తన ప్రధానమైన పరిశోధన సదుపాయాన్ని మరియు రాపిడ్ జనరేశన్ అడ్వాన్స్ మెంట్ ఫెసిలిటీ ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఈ రెండు సదుపాయాలు ప్రధానం గా ఆసియా కు, ఇంకా సబ్- సహారాన్ ఆఫ్రికా కు చెందిన చిన్న కమతాలు కలిగివున్న రైతుల కోసం ఏర్పాటు అయినటువంటి సదుపాయాలు. ఇక్రిశాట్ తాలూకు ప్రత్యేకంగా రూపుదిద్దిన ఒక అధికార చిహ్నం (లోగో) ను కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరిస్తారు. అలాగే ఈ సందర్భం లో జారీ చేసేందుకు ఉద్దేశించిన ఒక స్మారక తపాలా బిళ్ల ను ఆయన ప్రవేశపెడతారు.
ఇక్రిశాట్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్ధ ఆసియా లో మరియు సబ్- సహారాన్ ఆఫ్రికా లో అభివృద్ధిపరచడం కోసం ఉద్దేశించినటువంటి వ్యవసాయ సంబంధి పరిశోధనల ను నిర్వహిస్తూ ఉంటుంది. మెరుగుపరచినటువంటి పంటల రకాల ను మరియు హైబ్రిడ్ లను సమకూర్చడం ద్వారా రైతుల కు ఈ సంస్థ సహాయకారి గా ఉంటున్నది. అంతేకాకుండా మెట్టభూముల లో జలవాయు పరివర్తన కు వ్యతిరేకంగా పోరాడడం లో చిన్న కమతాల రైతుల కు తోడ్పడుతున్నది.